Jagan: కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించిన జగన్
- చాదర్ సమర్పించిన వైసీపీ అధినేత
- జగన్ ను చూసేందుకు తండోపతండాలుగా జనం
- జగన్ కు ఆశీస్సులు అందజేసిన అమీన్ పీర్ పీఠాధిపతి
పులివెందుల నియోజకవర్గ పర్యటన కోసం రెండ్రోజులుగా కడప జిల్లాలోనే ఉంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా ఆయన కడపలోని ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. జగన్ తో పాటు వైసీపీ నేత అవినాశ్ రెడ్డి, కార్యకర్తలు కూడా దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జగన్ ఈ దర్గాను సందర్శించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ కు అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ఆశీస్సులు అందజేశారు. కాగా, జగన్ వస్తున్నాడని తెలియడంతో ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో దర్గా వద్దకు చేరుకోవడంతో పరిసర ప్రాంతాలన్నీ క్రిక్కిరిసిపోయాయి.