Sadhvi Pragya Singh: సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

  • నివేదిక ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ సీఈఓకి ఆదేశం
  • గాడ్సే గొప్ప దేశభక్తుడు అన్న సాధ్వీ
  • దేశవ్యాప్తంగా విమర్శలు
మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు, బీజేపీ నేత సాధ్వీ ప్రజ్ఞా సింగ్ జాతిపిత గాంధీని చంపిన గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ప్రజ్ఞా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విమర్శలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజ్ఞా సింగ్ ను తప్పుబట్టారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి వివరాలతో నివేదిక అందించాలంటూ మధ్యప్రదేశ్ సీఈవోను ఆదేశించింది. ఓవైపు ఇప్పటికే పలు వివాదాలు ఉన్నా ప్రజ్ఞా సింగ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టు తాజా కామెంట్స్ చెబుతున్నాయి.
Sadhvi Pragya Singh

More Telugu News