Chandrababu: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: సీఈసీకి చంద్రబాబు లేఖ

  • రీపోలింగ్ ప్రకటనతో రాజకీయ ప్రకంపనలు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ
  • స్పందించకపోవడం దారుణమన్న చంద్రబాబు
చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గం రీపోలింగ్ అంశం ఏపీలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా, వైసీపీ ఫిర్యాదు చేయగానే ఈసీ రీపోలింగ్‌కు సిద్ధమైందంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఐదు పోలింగ్ బూత్‌ల పరిధిలో రీపోలింగ్ నిర్వహించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందని లేఖలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామిచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి విచారణ నిర్వహించపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు లేఖపై ఈసీ స్పందిస్తుందో లేదో చూడాలి.
Chandrababu
Telugudesam
YSRCP
CEC
Chandragiri
Repolling

More Telugu News