Poison: విషం తాగిన మహిళకు వైద్యులు చికిత్సనందించే క్రమంలో నోట్లో పేలుడు.. మృతి

  • నోట్లోకి పైపు పంపించిన వైద్యులు
  • సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఘటన
  • పేలుడుకి కారణం వివరించిన వైద్యులు
విషం తాగిన మహిళను వైద్యులు బతికించే క్రమంలో, నోట్లో పేలుడు సంభవించడంతో ఆమె మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ మహిళ విషం తాగడంతో బంధువులు ఆమెను హుటాహుటిన స్థానిక జేఎన్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స చేయడం ప్రారంభించిన వైద్యులు ఒక పైపును ఆమె నోట్లోకి పంపించారు.

ఇంతలో అనూహ్యంగా ఆమె నోట్లో పేలుడు సంభవించింది. దీంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆపరేషన్ థియేటర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనపై వైద్యులు మాట్లాడుతూ, మహిళ సల్ఫ్యూరిక్ ఆమ్లం తాగిందని, నోట్లోని పైపులో ఉన్న ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరిగి చిన్నపాటి పేలుడు సంభవించిందని వివరణ ఇచ్చారు. ఆసుపత్రి ప్రతినిధి మాట్లాడుతూ, ఘటనపై విచారణ జరుపుతున్నామని, అసలు కారణాలేంటో త్వరలో తేలుస్తామన్నారు.
Poison
Doctors
Treatment
Oxygen
Sulphuric Acid
JN Medical College

More Telugu News