KTR: సాధ్వీ ప్రజ్ఞా సింగ్ దేశానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే: కేటీఆర్ డిమాండ్

షార్ట్స్‌లో చూడండి
గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడు అంటూ బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయం అని ట్వీట్ చేశారు. జాతిపితను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు ఎలాంటి రాజకీయాలతో ముడిపడి ఉన్నా, ఏ సిద్ధాంతాలతో అంటకాగినా కొన్ని హద్దులు మాత్రం ఎప్పటికీ దాటకూడదని కేటీఆర్ హితవు పలికారు. కానీ, సాధ్వీ వ్యాఖ్యలు అత్యంత హేయమైనవిగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
KTR

More Telugu News