Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • ‘కాళేశ్వరం’, దాని అనుబంధ ప్రాజెక్టులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
  • ‘కాళేశ్వరం’పై ఉన్న పిటిషన్ల విచారణకు అంగీకారం 
  • ఈ కేసు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా  
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు, దాని అనుబంధ ప్రాజెక్టులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పిటిషన్లను విచారించేందుకు అంగీకారం తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.  

‘మల్లన్నసాగర్’ పనులను ఆపలేమన్న హైకోర్టు

మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్ల పైనా హైకోర్టు విచారణ చేసింది. నష్టపరిహారం స్వీకరించేందుకు నలభై ఏడు ఎకరాల్లో ఉన్న బాధితులు నిరాకరిస్తున్న విషయాన్ని హైకోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకొచ్చింది. బాధితుల చెక్కులను కోర్టులో డిపాజిట్ చేసింది. నలభై ఏడు ఎకరాల కోసం ఇంత పెద్ద ప్రాజెక్టులో పనులను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. బాధితులు ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించింది. 
Telangana
kalewsararam
high court
mallanasagar

More Telugu News