mamatha benarjee: మమతను మోదీ, అమిత్‌షా కావాలనే టార్గెట్‌ చేశారు: మాయావతి

  • ప్రధాన మంత్రి స్థాయికి ఇది తగదు
  • బెంగాల్‌లో ఓరోజు ముందు ప్రచారం నిలిపివేయడం సరైందిలా లేదు
  • ఈసీ కూడా మోదీ ఒత్తిడికి తలొగ్గుతోంది
ఎన్నికల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షాలు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ఈ రోజు ఉదయం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ  ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడడం ప్రమాదకరం, అభ్యంతరకరం అన్నారు.

బెంగాల్‌లో ఒక రోజు ముందు ప్రచారం నిలిపివేయాలన్న ఈసీ నిర్ణయం కూడా సరైందిగా తోచడం లేదని వ్యాఖ్యానించారు. అక్కడి ఘర్షణలు, శాంతిభద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ప్రధాని సభలు ప్రారంభానికి ముందే ప్రచారం నిలిపివేయాల్సిందన్నారు. కానీ ఆయన సభలు పూర్తయ్యాక ప్రచారం ముగుస్తుందన్న ప్రకటన చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొంచి ఈసీ పనిచేస్తోందని అనిపిస్తోందన్నారు.
mamatha benarjee
mayavathi
BJP
Narendra Modi
West Bengal

More Telugu News