gulam nabi azad: రాహుల్ కు ప్రధాని పదవి దక్కకపోయినా కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది లేదు: గులాం నబీ ఆజాద్
- ఎన్డీయే అధికారంలోకి రాకపోవడమే మా లక్ష్యం
- ప్రధాని పదవి కోసం పట్టుబట్టం
- మిత్రపక్షాలన్నీ కలసి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తాయి
తమ పార్టీకి (రాహుల్ కు) ప్రధాని పదవి దక్కకున్నా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి రాకపోవడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. 'మా లక్ష్యం ఏమిటనేది ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే... అప్పుడు ప్రధాని పదవి గురించి ఆలోచిస్తాం. మిత్రపక్షాలన్నీ కలసే ప్రధాని ఎవరనే విషయాన్ని నిర్ణయిస్తాయి. ఎన్డీయే అధికారంలోకి రాకపోవడమే మా లక్ష్యం' అని అన్నారు.
ప్రధాని ఎవరనే అంశాన్ని తాము వివాదాస్పదం చేయదలుచుకోలేదని... కాంగ్రెస్ పార్టీకే ప్రధాని పదవి కావాలని తాము పట్టుబట్టబోమని ఆజాద్ తెలిపారు. మహాకూటమి అధికారంలోకి వస్తుందన్న ధీమా ఉంటే... ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సవాల్ విసిరిన నేపథ్యంలో ఆజాద్ ఈ మేరకు స్పందించారు.