Madhya Pradesh: వివాహితతో అక్రమ సంబంధం: యువకుడిని, కుటుంబీకులను చెట్టుకు కట్టేసి వికృత చేష్టలు

  • మధ్యప్రదేశ్ లోని థార్ సమీపంలో ఘటన
  • చర్చించుకుందామని పిలిపించి నిర్బంధం
  • ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు మధ్యప్రదేశ్ లోని ధార్ సమీపంలోని ఓ గ్రామ వాసులు. గ్రామంలోని ఓ వివాహితను తనతో పాటుగా తీసుకువెళ్లిపోయాడన్న ఆగ్రహంతో, అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి వికృతంగా హింసించారు. ఈ కేసులో ఫిర్యాదును అందుకున్న పోలీసులు, ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ఆ వివరాల్లోకి వెళితే, ముఖేష్ అనే వ్యక్తి తన భార్యతో గ్రామంలో ఉంటుండగా, దగ్గర్లోనే ఉండే మరో వ్యక్తి ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఆమెను వదిలి వుండలేక ఆమెను తీసుకుని మరో ఊరుకి వెళ్లిపోయాడు. చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని అతన్ని పిలిపించిన ముఖేష్, ఆపై అతన్ని, అతని కుటుంబీకులను తన స్నేహితుల సాయంతో నిర్బంధించి, చెట్టుకు కట్టేశాడు.

అందరూ కలసి వారిని కర్రలతో విపరీతంగా కొట్టారు. ఈ ఘటనను వీడియో కూడా తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని, గాయాలతో పడున్న బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోస్కో సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశామని, మరింత మందిని అరెస్ట్ చేయాల్సి వుందని ధార్ ఎస్పీ సంజీవ్ ములే తెలిపారు. 
Madhya Pradesh
Police
Dhar

More Telugu News