kullu: బీజేపీ కార్యకర్తలతో వెళుతున్న బస్సు బోల్తా

  • హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో ప్రమాదం
  • 45 మందితో వెళ్తున్న బస్సు బోల్తా
  • ఏడుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు
బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు బోల్తాకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో ఈరోజు చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారని జిల్లా అదనపు ఎస్పీ రాజ్ కుమార్ చండేల్ చెప్పారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
kullu
bus
accident
bjp

More Telugu News