MB Balakrishnan: లారీ ఢీకొని దుర్మరణం పాలైన ఇంటర్నేషనల్ స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్!

  • చెన్నైకి చెందిన స్విమ్మర్ బాలకృష్ణన్
  • బైక్ పై వెళుతూ లారీని ఢీకొని మృతి
  • పలు అవార్డులు అందుకున్న స్విమ్మర్ 
భారత దిగ్గజ స్విమ్మర్, పలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ఎంబీ బాలకృష్ణన్, చెన్నై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తన బైక్ పై ఇంటికి వెళుతూ అదుపుతప్పిన ఆయన, ఓ లారీని ఢీకొనగా, లారీ చక్రాలు అతనిపై నుంచి వెళ్లాయి. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్‌ కాలేజిలో చదివిన బాలకృష్ణన్, ఆపై అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డారు.

ఇటీవల జరిగిన దక్షిణాసియా క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలలో పతకం సాధించారు. కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణన్ ఇండియాకు వచ్చారు. అతని మృతి పట్ల స్విమ్మింగ్ కోచ్ టీ చంద్రశేఖరన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 2007లో గువహటిలో జరిగిన జాతీయ స్విమ్మింగ్‌ లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, 2010 సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌ షిప్‌ లో 50మీ. బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగాలో జాతీయ రికార్డును బాలకృష్ణన్ నెలకొల్పారు. దక్షిణాసియా క్రీడల్లో 100మీ., 200మీ. బ్యాక్‌ స్ట్రోక్‌ విభాగాల్లో గోల్డ్ మెడల్ సంపాదించారు.
MB Balakrishnan
Swimmer
Road
Accident
Road Accident
Died

More Telugu News