Andhra Pradesh: చంద్రబాబు మాజీ అయిపోతాడని పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోంది: విజయసాయిరెడ్డి

  • వాగులు, నదులు కొల్లగొడుతున్నారు
  • గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి
  • ప్రతి జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి
ఏపీ సీఎం చంద్రబాబుపై, టీడీపీ నేతలపై ఏదో ఒక విమర్శ, ఆరోపణ చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ఓ ట్వీట్ చేశారు. ఏపీలో ఇసుక మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు. మరో వారం రోజుల్లో చంద్రబాబు మాజీ సీఎం అయిపోతాడని అర్థంకావడంతో, పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు. పగలూరాత్రీ లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని, ఈ విషయమై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలోని ప్రతి జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి మాఫియాను నియంత్రించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
cm
Chandrababu
YSRCP
vijayasaireddy
govener
narasimhan

More Telugu News