RaviPrakash: చాలా ఇబ్బందుల్లో వున్నాం.. విచారణకు రాలేము: పోలీసులకు రవిప్రకాశ్, నటుడు శివాజీ సమాచారం

  • వ్యక్తిగత కారణాలు ఉన్నాయి
  • 10 రోజుల సమయం కోరిన రవిప్రకాశ్
  • ఆరోగ్యం బాగాలేదన్న శివాజీ
  • ఇద్దరూ విజయవాడలో ఉన్నట్టు అనుమానం
తాను ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాల వద్ద ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని తెలుగు టీవీ చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం పంపారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరో 10 రోజుల గడువు కావాలని ఆయన కోరారు. పోలీసులకు ఈ సమాచారం మెయిల్ ద్వారా అందింది. రవిప్రకాశ్ బాటలోనే పయనించిన నటుడు శివాజీ, తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, తనకు కూడా 10 రోజుల గడువు కావాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన ఓ మెయిల్ ను పంపారు. రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు, ఐపీ అడ్రస్ ల ఆధారంగా వీరిద్దరూ విజయవాడలో ఉంటున్నట్టు గుర్తించారని తెలుస్తోంది.
RaviPrakash
Sivaji
TV9

More Telugu News