Narsareddy: యశోద ఆసుపత్రిలో నర్సారెడ్డిని పరామర్శించిన రేవంత్

  • దీక్ష భగ్నం చేసి యశోదకు తరలించిన పోలీసులు
  • ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్న నర్సారెడ్డి
  • న్యాయం జరిగే వరకూ కొనసాగిస్తానని స్పష్టం
భూ నిర్వాసితులకు మద్దతుగా ఆమరణ దీక్ష చేస్తున్న సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి దీక్షను పోలీసులు నిన్న భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనూ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.

నేడు నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగిస్తానని స్పష్టంచేశారు. నిర్వాసితులు కోరుకున్న విధంగా పరిహారం చెల్లించాలని నర్సారెడ్డి, సీఎం కేసీఆర్‌ను కోరారు.
Narsareddy
Revanth Reddy
Mallanna Sagar
Konda Pochamma
KCR

More Telugu News