Tollywood: వెండితెర ‘స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్’ ఏక్ నాథ్ మృతి

షార్ట్స్‌లో చూడండి
గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే చారిత్రక, జానపద చిత్రాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా రక్తికట్టించిన ప్రముఖ సినీ టెక్నీషియన్ ఏక్ నాథ్ (70) నేడు కన్నుమూశారు. ఆయన మృతిపై టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. ఏక్ నాథ్ కుటుంబసభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించారు.

విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన చాలా చిత్రాలకు ఏక్ నాథ్ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. త్రీ డీ సినిమాలకు ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పనిచేశారు. అగ్ర హీరోలు నటించిన సినిమాలకు ఆయన సేవలందించారు. ఏక్ నాథ్ తన సినీ కెరీర్ లో సుమారు 700 చిత్రాలకు పైగా స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఏక్ నాథ్ ప్రముఖ కెమెరామెన్ మోహనకృష్ణకు సోదరుడు. 
Go Back to Shorts
Tollywood
Bollywood
kollywood
Eknath

More Telugu News