indian: ప్రయాణంలో మృతి చెందిన భారతీయుడు.. యూఏఈలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • ఢిల్లీ నుంచి మిలాన్ వెళ్తున్న విమానంలో కైలాశ్ చంద్ర శైనీ మృతి
  • అబూదాబి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన విమానం
  • మఫ్రాక్ ఆసుపత్రికి డెడ్ బాడీ తరలింపు
ఢిల్లీ నుంచి మిలాన్ కు బయల్దేరిన విమానం యూఏఈలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక భారతీయ వ్యక్తి మృతి చెందడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. మృతుడు రాజస్థాన్ కు చెందిన కైలాశ్ చంద్ర శైనీ (52) అని ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది. తన 26 ఏళ్ల కుమారుడు హీరా లాల్ తో కలసి ప్రయాణిస్తుండగా ఈ విషాదకర ఘటన సంభవించిందని తెలిపింది.

ఈ సందర్భంగా ఎంబసీ కౌన్సిలర్ ఎం.రాజమురుగన్ మాట్లాడుతూ, అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సోమవారం రాత్రి ఈ ఘటన సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని మఫ్రాక్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. పోస్ట్ మార్టం వంటి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని, ఎతిహాద్ విమానంలో మృతదేహాన్ని భారత్ కు తరలిస్తామని చెప్పారు.
indian
dies
uae
abu dhabi

More Telugu News