Mahesh Babu: రికార్డుస్థాయి వసూళ్లతో నైజామ్ లో దుమ్మురేపేస్తోన్న 'మహర్షి'

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'మహర్షి' ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. విడుదలైన 6 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 20.54 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇంతవరకూ మహేశ్ బాబు చేసిన సినిమాల్లో నైజామ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా ఇదేనని అంటున్నారు. ఇక్కడ మహేశ్ బాబు పేరుతో వున్న రికార్డులను మహేశ్ బాబునే అధిగమించడం విశేషం. మహేశ్ బాబు 25వ సినిమాగా వచ్చిన 'మహర్షి' భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఆయనతో పాటు అభిమానులు ఫుల్ ఖుషీగా వున్నారు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News