YSRCP: జగన్ కోసమే తలనీలాలు సమర్పించా: హాస్యనటుడు పృథ్వీరాజ్

  • ఇంత వరకూ నా కోసం ఏ మొక్కూ మొక్క లేదు
  • అలాగే, నేను తలనీలాలివ్వలేదు
  • జగన్ సీఎం కావాలని స్వామి వారిని కోరుకున్నా
జగన్ సీఎం కావాలని శ్రీ వెంకటేశ్వరుడిని కోరుకున్నానని వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఆయన సందర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇంత వరకూ తన కోసం స్వామి వారికి ఏ మొక్కూ మొక్క లేదు, తలనీలాలు ఇవ్వలేదని అన్నారు. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ తన తలనీలాలు తొలిసారిగా ఇచ్చానని అన్నారు. జగన్ సీఎం అయ్యేందుకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని, ఆ సీటులో ఆయన్ని కూర్చోబెట్టి, ప్రజారంజకమైన పాలన అందించే శక్తిని ఆయనకు ప్రసాదించమని కోరుకున్నట్టు చెప్పారు.

శ్రీవారిని దర్శించుకున్న మరో వైసీపీ నేత కొడాలి నాని మాట్లాడుతూ, వైసీపీకి అత్యధిక స్థానాలు రావాలని, జగన్ సీఎం కావాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని వేడుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితుల నుంచి కాపాడాలని ఏడుకొండల వాడిని కోరానని అన్నారు.
YSRCP
jagan
comedian
prudhviraj

More Telugu News