Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడో వెట్ రన్ విజయవంతం... తెలంగాణ అధికారుల్లో ఆనందం

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేబట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరో ముందడుగు విజయవంతంగా పడింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్ద భూగర్భంలో నిర్మించిన పంప్ హౌస్ లో మూడో మోటార్ వెట్ రన్ ఇవాళ నిర్వహించగా విజయవంతమైంది. వెట్ రన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా జరగడంతో అధికారులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

మూడో మోటార్ వెట్ రన్ ను తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్ సీ వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ రావ్ దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. మూడో వెట్ రన్ సక్సెస్ అయిన నేపథ్యంలో అధికారులు ఈ సాయంత్రమే నాలుగో వెట్ రన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి కీలకమైన తొలి రెండు వెట్ రన్ లు విజయవంతమైన సంగతి తెలిసిందే. గత నెల చివరివారంలో వీటిని నిర్వహించారు.
Go Back to Shorts
Telangana
Kaleswaram

More Telugu News