world cup: ప్రపంచ కప్ హాట్ ఫేవరెట్ ఎవరో వెల్లడించిన అజార్

  • హాట్ ఫేవరెట్ ఇండియానే
  • రెండు, మూడు స్థానాలను ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ఇస్తా
  • ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసే బౌలర్లు మనకు ఉన్నారు
ఈ ప్రపంచకప్ ను గెలిచే సత్తా భారత్ కు ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అన్నారు. టీమిండియానే ఈ ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ అని చెప్పారు. ఇంగ్లండ్ టూర్ కు వెళ్లినప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌలర్లు మనకు ఉన్నారని అన్నారు. అక్కడి పిచ్ లు బౌలర్లకు అనుకూలిస్తే మనకు ఇబ్బంది ఎదురవుతుందని చాలా మంది అంటున్నారని... ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయగల సత్తా ఉన్న బౌలర్లు మనకూ ఉన్నారని చెప్పారు. మన బ్యాటింగ్ లైనప్ కూడా అద్భుతంగా ఉందని అన్నారు. ఇంతటి బలమైన జట్టుతో మనం ప్రపంచ కప్ గెలవకపోతే... తాను చాలా నిరాశకు గురవుతానని చెప్పారు. రెండు, మూడు స్థానాలను ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ఇస్తానని తెలిపారు. 
world cup
icc
hot favourate
azharuddin

More Telugu News