akkineni nageswar rao: విగ్రహాల తొలగింపుపై.. నిరసనకు దిగిన ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం

షార్ట్స్‌లో చూడండి
విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఈ మూడు విగ్రహాలను తొలగించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంఘం నిరసనకు దిగింది. సినీ పరిశ్రమకు విశేషమైన సేవలందించిన వీరి విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 
Go Back to Shorts
akkineni nageswar rao
dasari narayana rao
nandamuri harikrishna
statue
visakhapatnam

More Telugu News