Chandrababu: హైదరాబాద్ కు బయలుదేరిన చంద్రబాబు!

  • రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రైవేట్ కార్యక్రమం
  • హాజరుకానున్న ఏపీ సీఎం
  • మధ్యాహ్నం తరువాత తిరిగి అమరావతికి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరో రెండు గంటల్లో హైదరాబాద్ కు రానున్నారు. గత రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంలో ఎంతో బిజీగా గడిపిన ఆయన, ఒకటి, రెండు సందర్భాల్లో మాత్రమే హైదరాబాద్ కు వచ్చి వెళ్లారు. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత తిరిగి ఆయన అమరావతికి బయలుదేరుతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మరో వారం రోజుల్లో సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Chandrababu
Amaravati
Ramoji Film City
Hyderabad

More Telugu News