Rahul Gandhi: మోదీ తల్లిదండ్రులను అవమానించడం కంటే చనిపోవడానికే ఇష్టపడతా: రాహుల్ గాంధీ

  • వాస్తవ అంశాలను పక్కన బెట్టేస్తారు
  • మామిడి పండ్లు, మేఘాల గురించి మాట్లాడుతారు
  • దేశానికి ఏం చేశారో చెప్పరు
ద్వేషాన్ని వెదజల్లేందుకు తానేమీ బీజేపీ, ఆరెస్సెస్ నుంచి రాలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఉజ్జయినిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ, బీజేపీని ప్రేమతోనే మట్టి కరిపిస్తుందన్నారు. తన నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీల గురించి ప్రధాని నరేంద్ర మోదీ అవమానకర వ్యాఖ్యలు చేస్తుండటం పట్ల రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను మోదీ తల్లిదండ్రులను అవమానించాల్సిన పరిస్థితే వస్తే, దానికంటే చనిపోవడానికే ఇష్టపడతానని రాహుల్ పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ, వాస్తవ అంశాలను పక్కనబెట్టి మామిడ పండ్లు, మేఘాల గురించి మాట్లాడతారని రాహుల్ ఎద్దేవా చేశారు. మామిడి పండ్లు ఎలా తినాలో చెబుతారు కానీ నిరుద్యోగ యువతకు, దేశానికి ఏం చేశారో చెప్పరని విమర్శించారు.
Rahul Gandhi
Narendra Modi
BJP
Congress
Loksabha
Rajiv Gandhi
Indira Gandhi

More Telugu News