cuddapah: కడప చేరుకున్న వైఎస్ జగన్.. ఘన స్వాగతం పలికిన నాయకులు

  • జగన్ మూడ్రోజుల పర్యటన  
  • రేపు, ఎల్లుండి పులివెందులలో ఉండనున్న అధినేత
  • రేపు సాయంత్రం ఇఫ్తార్ విందుకు హాజరుకానున్న జగన్
వైసీపీ అధినేత జగన్ మూడ్రోజుల పర్యటన నిమిత్తం ఆయన కడపకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కడప విమానాశ్రయం వద్ద వైసీపీ నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు జగన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తన స్వస్థలం పులివెందులకు జగన్ వెళ్లారు. రేపు, ఎల్లుండి పులివెందులలో ప్రజలకు ఆయన అందుబాటులో ఉండనున్నారు. పులివెందులలోని వైసీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజా సమస్యల గురించి ఆయన తెలుసుకోనున్నారు. రేపు సాయంత్రం పులివెందులలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు జగన్ హాజరుకానున్నారు.
cuddapah
YSRCP
ys jagan
pulivendula

More Telugu News