cbse: సీబీఎస్సీ పదో తరగతి విద్యార్థిని నవ్యకు సీఎం చంద్రబాబు అభినందనలు

  • రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించిన నవ్య
  • చంద్రబాబును కలిసిన నవ్య, ఆమె తల్లిదండ్రులు
  • ఉన్నత విద్యలో కూడా రాణించాలని కోరిన బాబు
సీబీఎస్సీ పదో తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించిన విద్యార్థిని గొర్రెల నవ్యను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. నవ్య తన తల్లిదండ్రులతో కలిసి సచివాలయంలో చంద్రబాబును ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా నవ్యను అభినందించిన చంద్రబాబు, ఆమెకు మిఠాయి తినిపించారు. ఉన్నత విద్యలో కూడా నవ్య తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించి, భవిష్యత్ లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నవ్య తల్లిదండ్రులను చంద్రబాబు అభినందించారు.
cbse
10th class
navya
cm
Chandrababu

More Telugu News