Nalgonda District: తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తా: ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి

  • మా కుటుంబానికి ప్రజల అభిమానం ఉంది
  • మహిళలకు నా వంతు సేవ చేస్తా
  • అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా
నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సూచనతోనే పోటీకి దిగుతున్నానని, తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్నో సార్లు తామేంటో నిరూపించుకున్నారని, తమ కుటుంబానికి ప్రజల అభిమానం ఉందని అన్నారు. మహిళలకు తన వంతు సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  
Nalgonda District
MLC
komati reddy
lakshmi reddy

More Telugu News