Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
  • కరవు, ‘ఫణి’ తుపాన్ తదితర అంశాలపై చర్చ
  • భేటీకి హాజరుకాని పితాని, ఆదినారాయణరెడ్డి, అమరనాథ్ రెడ్డి
ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులు, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఏపీలో కరవు, ‘ఫణి’ తుపాన్, తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. కాగా, వ్యక్తిగత కారణాల రీత్యా ఈ భేటీకి మంత్రులు పితాని సత్యనారాయణ, ఆదినారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి హాజరు కాలేదు. ఇదిలా ఉండగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే తమ అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ధరల సవరింపు, బకాయిల చెల్లింపులపై అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని సీఈసీ సూచించింది.
Andhra Pradesh
cabinet
meeting
cm
Babu

More Telugu News