Andhra Pradesh: ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ కోసం.. చంద్రబాబుకు రూ.లక్ష విరాళం అందజేసిన హైదరాబాదీ!

  • ఈరోజు ఉండవల్లికి వచ్చిన శ్రీనివాసరావు
  • ఎన్టీఆర్ సుజల స్రవంతికి వాడాలని విజ్ఞప్తి
  • శ్రీనివాసరావును అభినందించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువాళ్లు విరాళాలు అందించారు. పలువురు వ్యక్తులు అమరావతి ఇటుకలను రూ.10 చొప్పున కొనుగోలు చేసి ప్రభుత్వానికి అండగా నిలిచారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన తెలుగు వ్యక్తి ఈదర వెంకట శ్రీనివాసరావు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుకు రూ.లక్ష చెక్కును విరాళంగా అందజేశారు.

ఈ మొత్తాన్ని ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పథకం అమలుకు వినియోగించాలని కోరారు. ఈరోజు ఉండవల్లిలోని సీఎం కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాసరావు ఈ చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Hyderabad
ntr sujala sravanti
rs.1 lakh check

More Telugu News