anushka sharma: తెర వెనుక నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి: అనుష్క శర్మ

  • వచ్చిన ఆఫర్లన్నీ తీసుకోలేం
  • నిర్మాతగా కూడా సమయం కేటాయించాలి
  • అందుకే కొత్త సినిమాకు సైన్ చేయలేదు
గత ఏడాది 'జీరో' సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇంతవరకు మరో సినిమాను ఒప్పుకోలేదు. దీనిపై ఆమె స్పందిస్తూ, తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని... వాటికి సమయాన్ని కేటాయించడం కోసమే కొత్త సినిమాకు సైన్ చేయలేదని చెప్పింది. సినీ నటిగా 2018లో 'పారి', 'సూయీ ధాగా', 'జీరో' సినిమాలు చేశానని... ఈ మూడు చిత్రాలు విభిన్నమైనవని తెలిపింది. విభిన్నమైన చిత్రాలను చేయాలంటే ఎంతో ప్రిపరేషన్ అవసరమని చెప్పింది. అందువల్ల వచ్చిన ఆఫర్లన్నింటినీ తీసుకోలేమని చెప్పింది.

ఓవైపు నటిగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నానని... ప్రస్తుతం ఒక సినిమాతో పాటు, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కోసం షోలను నిర్మిస్తున్నానని అనుష్క తెలిపింది. వీటికి కూడా సమయాన్ని కేటాయించాల్సి ఉందని చెప్పింది. తెర వెనుక తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపింది.
anushka sharma
bollywood

More Telugu News