Prudhvi Raj: జగన్ సీఎం కావాలంటూ కాలినడకన తిరుమలకు వెళ్లిన '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీరాజ్!

  • జగన్ కోసం తొలిసారిగా కొండకు నడిచివచ్చాను
  • తలనీలాలు కూడా సమర్పిస్తానన్న పృథ్వీరాజ్
  • అమరావతి కోటపై వైసీపీ జెండా ఎగురుతుందన్న పృథ్వీ 
తెలుగు చిత్ర పరిశ్రమలో '30 ఇయర్స్ ఇండస్ట్రీ'గా గుర్తింపు పొంది, ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నటుడు పృథ్వీరాజ్, నేడు కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, తాను తొలిసారిగా నడిచి కొండెక్కానని, వైఎస్ జగన్ సీఎం అయ్యే క్రమంలో ఆటంకాలు కలుగకుండా చూడాలని స్వామిని మొక్కుతున్నానని అన్నారు. జగన్ సీఎం కావాలని కోరుతూ తలనీలాలు సమర్పిస్తానని చెప్పారు. ఏపీ ప్రజలంతా జగన్ సీఎం కావాలని అనుకుంటున్నారని, ఈ నెల 23న అమరావతి కోటపై వైసీపీ జెండా ఎగురుతుందని అన్నారు.
Prudhvi Raj
YSRCP
Pilli Subhas Chandrabose
Tirumala

More Telugu News