mallana sagar: ఉన్నత న్యాయస్థానం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు!: పొన్నం ప్రభాకర్

  • ‘మల్లన్నసాగర్’ బాధితులకు పరిహారం చెల్లించరే?
  • న్యాయస్థానాలపై ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదు
  • హైకోర్టు సూచనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితుల విషయమై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీ-కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. న్యాయస్థానాలపై ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. కోర్టు ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న హైకోర్టు సూచనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. 
mallana sagar
project
congress
ponnam

More Telugu News