Maharshi: నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మహర్షి’.. ఆనందంలో చిత్రబృందం

  • మహేశ్, పూజ జంటగా ‘మహర్షి’
  • అల్లరి నరేష్‌కు మంచి టర్నింగ్ పాయింట్
  • ఆకట్టుకుంటున్న రైతుకు సంబంధించిన సన్నివేశాలు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో మూడు గెటప్‌ల్లోనూ మహేశ్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా రైతులకు సంబంధించిన సన్నివేశాలు యూత్‌ని సైతం బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన వారంతా వీకెండ్ వ్యవసాయం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒకరకంగా ఇది సినిమా పబ్లిసిటీకి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అల్లరి నరేష్‌కు మంచి టర్నింగ్ పాయింట్. అతి తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో ‘మహర్షి’ చిత్రబృందం ఆనందంలో మునిగి తేలుతోంది.
Maharshi
Mahesh Babu
Puja Hegde
Vamsi Paidipalli
Allari Naresh

More Telugu News