చౌకీదార్‌ను ఢిల్లీ నుంచి, ధోకీదార్‌ను లక్నో నుంచి గద్దె దింపాల్సిన అవసరముంది: అఖిలేశ్ యాదవ్
- మహాకూటమి కొత్త ప్రధానిని అందిస్తుంది
- నవభారత నిర్మాణం జరిపి తీరుతుంది
- యువత ఉద్యోగాలను బీజేపీ కొల్లగొట్టిందన్న అఖిలేశ్
ఎంతమంది రైతులకు బీజేపీ రుణ మాఫీ చేసింది? రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. నవభారత నిర్మాణం జరుపుతామని బీజేపీ గొప్పలు చెప్పిందని, వారి హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. అబద్ధాలు, విద్వేషాల వ్యాప్తితో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని అఖిలేశ్ ఆరోపించారు. ఈ సంయుక్త ర్యాలీలో బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ పాల్గొన్నారు.