IPL: నాకు అద్భుతమైన మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చావు... థాంక్యూ ఆకాశ్!: నీతా అంబానీ

షార్ట్స్‌లో చూడండి
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రికార్డుస్థాయిలో నాలుగో పర్యాయం టైటిల్ గెల్చిన ముంబయి ఇండియన్స్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ జట్టు యజమానురాలైన నీతా అంబానీ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. సరిగ్గా మదర్స్ డే రోజున ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడం పట్ల నీతా స్పందిస్తూ, తనయుడు ఆకాశ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

"మదర్స్ డే సందర్భంగా ఏకంగా ఐపీఎల్ టైటిల్ నే కానుకగా ఇచ్చావు... థాంక్యూ ఆకాశ్" అంటూ మురిసిపోయారు. ‌'ముంబయి ఇండియన్స్ ఫ్యామిలీ' పేరుతో అనేక ఆటవిడుపు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల్లోనూ శ్రద్ధ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసి వారు ఆటపై శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవడంలో ఆకాశ్ సఫలం అయ్యాడని నీతా పేర్కొన్నారు. కాగా, ఐపీఎల్ చర్రితలో ముంబయి ఇండియన్స్ మినహా మరే జట్టూ నాలుగుసార్లు టైటిల్ గెలవలేదు.
Go Back to Shorts
IPL
MI

More Telugu News