RTGS: కడప, విశాఖ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

  • పలు మండలాల్లో పిడుగులు పడొచ్చంటూ సూచన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి
  • మీడియాకు వివరాలు తెలిపిన ఆర్టీజీఎస్
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ (ఆర్టీజీఎస్) కడప, విశాఖ జిల్లాల్లోని పలుప్రాంతాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసింది. మరికొన్ని నిమిషాల్లో కడప జిల్లాలోని కలసపాడు, కాశీనాయన, పోరుమామిళ్ల మండలాలతో పాటు విశాఖ జిల్లాలోని జి.మాడుగుల, అరకు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేర్కొంది. ఆయా మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనులు చేసుకునేవాళ్లు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఆర్టీజీఎస్ అధికారులు మీడియాకు వివరాలు తెలిపారు.
RTGS
Andhra Pradesh

More Telugu News