Kamal Haasan: కమలహాసన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం... క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్

  • కమల్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం
  • ఎన్నికల్లో ఓట్ల కోసమేనంటూ విమర్శ
  • త్వరలో ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం
స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది ఓ హిందూ అంటూ మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసమే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన అందరికీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, త్వరలోనే దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. కమల్ అంతకుముందు, దేశంలో అతి ప్రధాన సమస్య హిందూ ఉగ్రవాదమే అని, స్వాతంత్య్రం వచ్చాక దేశంలో మొదటి టెర్రరిస్టు కూడా హిందువేనంటూ నాథూరామ్ గాడ్సే ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
Kamal Haasan

More Telugu News