shivashankar master: మా కోడలు మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది: శివశంకర్ మాస్టర్

షార్ట్స్‌లో చూడండి
నృత్య దర్శకుడిగా శివశంకర్ కి ఎంతో మంచి పేరు వుంది. సుదీర్ఘ కాలంగా ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన తన కోడలి కారణంగా తాము పడుతోన్న వేదన గురించి ప్రస్తావించారు. "మా కోడలిని మేము ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. మా గురించి ఆమె చెబుతున్నదాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. మా కోడలే మమ్మల్ని నానా హింసలు పెట్టింది.

డబ్బు కోసమే ఆమె వచ్చింది .. దానికోసమే ఇదంతా చేస్తోంది .. ఆ పరమేశ్వరుడే అంతా చూసుకుంటాడు. ఒక రకంగా ఆమెను నా గురువుగా భావిస్తున్నాను. ఎందుకంటే డాన్స్ తప్ప మరేమీ తెలియని నాకు కోర్టు ఎలా ఉంటుందో చూపించింది. కోర్టుకు సంబంధించిన పనులను నేర్పించింది. లోకం ఎలా వుంది? .. ఒక సమస్య ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలను అనుభవంలోకి తెచ్చింది. ఇవన్నీ ఆమె మూలంగా తెలిశాయి గనుక .. ఆమెకి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.
Go Back to Shorts
shivashankar master

More Telugu News