Narendra Modi: భార్యనే వదిలేసిన మోదీకి ఇతరుల భార్యల పట్ల గౌరవం ఏం వుంటుంది?: మాయావతి షాకింగ్ కామెంట్స్

  • కట్టుకున్న భార్యనే వదిలేయడం సిగ్గుచేటు 
  • నీచ రాజకీయాలకు పాల్పడుతున్న మోదీ
  • బీజేపీ నేతల భార్యలు భయపడుతున్నారన్న మాయావతి
తాను కట్టుకున్న భార్యనే వదిలేయడం అత్యంత సిగ్గుచేటైన విషయమని, భార్యను వదిలేసిన నరేంద్ర మోదీకి ఇతరుల భార్యలు, సోదరీల పట్ల గౌరవం ఎలా ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన కామెంట్స్ చేశారు. ఆళ్వార్ లో సంచలనం రేపిన అత్యాచార ఘటనపై మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మాయావతి, మోదీవి చిల్లర రాజకీయాలని అన్నారు.

నీచ రాజకీయాలు చేస్తూ, బీజేపీకి మేలు చేకూర్చడమే ఆయన ఉద్దేశమని మండిపడ్డారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, తమ భర్తలు ప్రధానిని కలుస్తున్నారంటే, బీజేపీ నేతల భార్యలు భయంతో వణుకుతున్నారని, మోదీలాగే తమ భర్తలు కూడా తమను వదిలేస్తారన్న భయం వారిలో ఉందని అన్నారు. ఆ పార్టీలో వివాహితులైన నేతల భార్యలు తమ భర్తలను మోదీతో చూసి ఆందోళన చెందుతున్నారని అన్నారు. కాగా, దేశంలో సార్వత్రిక సమరం తుది దశకు చేరిన నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు కూడా హద్దులు దాటుతున్నాయి.
Narendra Modi
Mayawati
Comments

More Telugu News