Andhra Pradesh: చంద్రబాబు పిట్టలదొరలను మించిపోయారు.. టీడీపీకి ఈసారి 30 సీట్లు కూడా దక్కవు!: విజయసాయిరెడ్డి

  • అనుకూల మీడియాలో కథనాలు రాయించుకుంటున్నారు
  • ప్రధాని ఏమో కానీ బాబు జైలుకెళ్లడం మాత్రం ఖాయం
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ సీనియర్ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలకు వినోదాన్ని పంచే  పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను చంద్రబాబు మించిపోయారని ఎద్దేవా చేశారు. ఈసారి ఏపీలో టీడీపీకి కనీసం 30 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

అయినా తన అనుకూల మీడియాలో ప్రధాని రేసులో ఉన్నట్లు చంద్రబాబు కథనాలు రాయించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆయన ప్రధాని కావడం ఏమోకానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘‘ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకీ రాముళ్లను మించి పోయాడు చంద్రబాబు. రాష్ట్రంలో కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సీన్ లేదు. అనుకూల మీడియాతో ప్రధాని రేసులో ఉన్నాడని ‘కలల’ కథనాలు రాయించుకుంటున్నాడు. ప్రధాని పదవేమో కానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం’’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News