Maharshi: డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన హీరోయిన్ పూజా హెగ్డే... మేనేజర్ వివరణ!

  • ఇటీవల 'మహర్షి' యూనిట్ పార్టీ
  • ఆపై డ్రంకెన్ డ్రైవ్ లో పూజా దొరికినట్టు వార్తలు
  • కారులో డ్రైవర్ తోనే వెళ్లారని మేనేజర్ స్పష్టీకరణ
'మహర్షి' హీరోయిన్ పూజా హెగ్డే, పూటుగా మందు కొట్టి, పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె మేనేజర్ స్పందించారు. ఇటీవల 'మహర్షి' టీమ్ పార్టీ చేసుకోగా, అందులో పాల్గొన్న వారంతా మద్యం మత్తులో వాహనాలు నడిపారని, అందులో పూజా కూడా ఉందని, ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారని వార్తలు వస్తుండగా, ఆమె మేనేజర్ స్పందించారు.

తామంతా పార్టీ చేసుకున్న మాట వాస్తవమేనని, అయితే, సినిమా ప్రొడక్షన్ టీమ్, అందరికీ వాహనాలను సమకూర్చిందని చెప్పారు. పైగా, ఆ సమయంలో పూజా హెగ్డే తన విమానాన్ని అందుకోవాల్సి ఉండడంతో ఓ డ్రైవర్ ను ఇచ్చి మరీ డ్రాప్ చేయించామని, ఆ సమయంలో పోలీసుల తనిఖీలు జరుగుతుండగా, కారులో పూజ కనిపించారే తప్ప, ఆమె పట్టుబడిన వార్తలు మాత్రం అవాస్తవమని అన్నారు.
Maharshi
Pooja Hegde
Drunk Driving

More Telugu News