YSRCP: ‘ప్రజాదర్బార్’ కోసం రేపు పులివెందులకు జగన్

  • రేపు సాయంత్రం హైదరాబాద్‌ నుంచి పులివెందులకు
  • బుధవారం ప్రజాదర్బార్‌లో పాల్గొననున్న వైసీపీ చీఫ్
  • గురువారం తిరిగి హైదరాబాద్‌కు
మూడు రోజుల పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (మంగళవారం) కడప జిల్లాలోని పులివెందుల వెళ్లనున్నారు. రేపు సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ఆయన పులివెందుల చేరుకుంటారు. రాత్రికి తన నివాసంలో బస చేస్తారు. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అదే రోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
YSRCP
Jagan
Kadapa District
pulivendula
Hyderabad

More Telugu News