Dhoni: ముంబై విజయానికి సూచనలు చేస్తూ ధోని అభిమాని లేఖ.. సోషల్ మీడియాలో వైరల్

  • చెన్నైని ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ లేఖ
  • మొదటి నాలుగు ఓవర్లలోనే కట్టడి చేయాలి
  • వాట్సన్, డుప్లెసిస్‌‌లను ఔట్ చేయాలి
నేడు ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీనికి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ ముంబై ఇండియన్స్‌కి ఓ అభిమాని లేఖ రాశాడు. అయితే ఈ లేఖ రాసిన వ్యక్తి ధోనికి అభిమాని కావడం విశేషం.

ఆ లేఖలో ఆటగాళ్లను ఎవరెవరిని తీసుకోవాలో కూడా ఆ అభిమాని సూచించాడు. మొదటి నాలుగు ఓవర్లలోనే చెన్నైని పరుగులు చేయనియ్యకుండా కట్టడి చేయాలని, ఈ నాలుగు ఓవర్లలోనే సాధ్యమైనంత వరకు ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్‌‌లను ఔట్ చేయాలని అభిమాని లేఖలో పేర్కొన్నాడు. అలాగే రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్‌ల భాగస్వామ్యం ముంబై విజయానికి కీలకమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Dhoni
Chennai Super kings
Mumbai Indians
Watson
Duplesis
Rohit Sharma

More Telugu News