Andhra Pradesh: ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు!: నటి మాధవీ లత

  • గత ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పగలిగారు
  • రాజకీయాల్లో ఎంత సీనియారిటీ ఉన్నా పట్టించుకోరు
  • ఎంత అభివృద్ధి జరిగిందన్నదే ప్రజలు చూస్తారు
ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేక పోతున్నారని బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీ లత తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న విషయాన్ని ప్రజలు గానీ, విశ్లేషకులు గానీ చెప్పగలిగారని, ఈసారి మాత్రం చెప్పలేకపోతున్నారని అన్నారు. ‘అభివృద్ధికి పట్టం కడతారా? ‘ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి’ అన్న వాళ్లకు పట్టం కడతారా?’ అనే ప్రశ్నకు మాధవీ లత స్పందిస్తూ, ‘నేను విన్నది ఏంటంటే.. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధికి పట్టం కడతారేమో. ఎందుకంటే, ఉన్నవాళ్లు పట్టం కట్టలేకపోతున్నారు కాబట్టి ఇంకొకరికైనా యిస్తే బాగుంటుంది’ అని అన్నారు. ఎంత అభివృద్ధి జరిగిందన్నదే ప్రజలు చూస్తారు కనుక, రాజకీయాల్లో ఎంత సీనియారిటీ ఉన్నా పట్టించుకోరని అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
bjo
madhavi latha

More Telugu News