maharshi: బ్లాక్ బస్టర్ ‘మహర్షి’ని తల్లులందరికీ అంకితం చేస్తున్నా: హీరో మహేశ్ బాబు

  • అమ్మంటే నాకు దేవుడితో సమానం
  • అమ్మ చేతి కాఫీ తాగితే ప్రసాదం తిన్నంత తృప్తి
  • ఆమె ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం
ఈరోజు చాలా స్పెషల్ డే, ‘మదర్స్ డే’ అని, ‘నాకు అమ్మంటే దేవుడితో సమానం’ అని ప్రముఖ హీరో మహేశ్ బాబు అన్నారు. ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, తన సినిమా రిలీజ్ కు ముందు తన తల్లి ఇచ్చే కాఫీ తాగుతానని, ఆ కాఫీ తాగితే గుడిలో ప్రసాదం తిన్నంత తృప్తిగా ఉంటుందని అన్నారు. ఆమె ఆశీస్సులు తనకు చాలా ముఖ్యమని, అందుకే తనకు విజయాలు లభిస్తున్నాయని అన్నారు. ఎంతో గొప్ప బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని తల్లులందరికీ అంకితం చేస్తున్నట్టు మహేశ్ పేర్కొన్నారు.
maharshi
mahesh babu
vamsi
paidipalli

More Telugu News