Warangal Urban District: వరంగల్, హన్మకొండ జిల్లాలు పునర్విభజన జరిగే అవకాశం : మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
- పరకాల మాత్రం వరంగల్ జిల్లాలోనే ఉంటుంది
- ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదు
- వృద్ధులకు గౌరవమిచ్చిన వ్యక్తి కేసీఆర్ అని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హన్మకొండ జిల్లాలు పునర్విభజనకు నోచుకునే అవకాశం ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. అదే సమయంలో భూపాలపల్లిలో పరకాలను కలపనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అది ఎప్పటికీ వరంగల్ జిల్లాలోనే ఉంటుందని తెలిపారు. వరంగల్ జిల్లా దామెర్ల మండలం ల్యాదెళ్ల గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ ముఖ్య కార్తకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మాత్రం త్వరలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. గడచిన 70 ఏళ్లలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని, మేలంటూ జరిగితే సీఎం కేసీఆర్ వల్లేనని చెప్పారు. రాష్ట్రంలో వృద్ధులకు గౌరవమిచ్చిన ఘనత, రైతు సంక్షేమానికి కృషి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కేంద్రంలో కేసీఆర్ నిర్ణయించిన వ్యక్తులే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు.