Jana Sena: నేడు మంగళగిరిలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ కానున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌

  • సార్వత్రిక ఎన్నికల విజయావకాశాలపై చర్చ
  • పోలింగ్‌ సరళి, గెలుపు అవకాశాలపై ఆరా
  • కౌంటింగ్‌ రోజు ఎలా వ్యవహరించాలన్న దానిపై సూచనలు
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారితో జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఈరోజు భేటీ అవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాల్సిందిగా అభ్యర్థులందరికి ఇప్పటికే సమాచారం పంపినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ సమావేశంలో పోలింగ్‌ సరళి, ఏయే స్థానాల్లో పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి తదితర అంశాలపై అభ్యర్థుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు. అదే విధంగా ఈనెల 23వ తేదీన జరగనున్న కౌంటింగ్‌ రోజు పార్టీ ప్రతినిధులు ఎలా వ్యవహరించాలన్నదానిపైనా సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

Jana Sena
Pawan Kalyan
mangalagiri
party meeting

More Telugu News