Pawan Kalyan: ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మెజారిటీ వస్తుందనే విషయాలపై మాట్లాడను: పవన్

  • కచ్చితంగా మార్పునకు నాంది పలుకుతాయి
  • వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాలని కోరుకుంటున్నాం
  • ఎంత శాతం లెక్కించాలనేది నిపుణుల నిర్ణయం
ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది? ముఖ్యంగా తాను పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎంత మెజారిటీ వస్తుందనే విషయాలపై మాట్లాడబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నేడు కర్నూలు పర్యటనలో భాగంగా ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వపన్ మీడియాతో మాట్లాడారు.

ఈ ఎన్నికలు కచ్చితంగా మార్పునకు నాంది పలుకుతాయన్నారు. తాము కూడా ఈవీఎంల వాడకంలో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాలని కోరుకుంటున్నట్టు పవన్ తెలిపారు. ఈ స్లిప్పులు ఎంత శాతం లెక్కించాలనే అంశాలను నిపుణులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Pawan Kalyan
Elections
EVM
VVPat
SPY Reddy

More Telugu News