BJP: మోదీ కోసం వారణాసిలో ఇంటింటికీ తిరుగుతున్న కన్నా లక్ష్మీనారాయణ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. మోదీని మరోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ కన్నా వారణాసిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. స్థానిక బీజేపీ నేతల సాయంతో ఆయన వారణాసిలో పర్యటిస్తూ, కనిపించినవాళ్లకల్లా కరపత్రాలు పంచిపెడుతూ ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మే 23 తర్వాత ప్రధానమంత్రి పీఠం అధిష్ఠించేది మోదీయేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రధానిగా మోదీని తప్ప మరొకరిని ప్రజలు అంగీకరించడంలేదని అన్నారు.
Go Back to Shorts
BJP
Narendra Modi

More Telugu News