sunny deol: సన్నీకి వస్తున్న మద్దతును చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతోంది: ధర్మేంద్ర

  • ముంబైలో కూర్చుని సన్నీ రోడ్ షో చూశా
  • సన్నీపై ఇంత ప్రజాభిమానం ఉంటుందని అనుకోలేదు
  • సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ప్రజల సమస్యలు తెలుసు
బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో సన్నీ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతని తండ్రి, సీనియర్ నటుడు ధర్మేంద్ర మాట్లాడుతూ, 'ముంబైలో కూర్చొని గురుదాస్ పూర్ లో సన్నీ నిర్వహించిన రోడ్ షోను చూశా. పంజాబ్ ప్రజల నుంచి సన్నీకి వచ్చిన మద్దతు నన్ను ఎంతో సంతోషానికి గురి చేసింది. సన్నీని ప్రజలు ఇష్టపడతారనే విషయం నాకు తెలుసు. కానీ, ఆ ఇష్టం ఇంత స్థాయిలో ఉంటుందని మాత్రం అనుకోలేదు' అని చెప్పారు.

ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల సమస్యలు ఏమిటో పూర్తిగా తెలుసని ధర్మేంద్ర చెప్పారు. సన్నీతో పాటు తాను ఉంటానని... ప్రజల సమస్యల పరిష్కారం కోసం పంజాబ్ కు వెళతానని, అలాగే కేబినెట్ మంత్రులను కూడా కలుస్తానని తెలిపారు. తాను ఏ పార్టీ వెంట లేనని... ప్రజలతో ఉంటానని చెప్పారు. నా దేశం పట్ల నాకున్న ప్రేమ ఇది అని చెప్పారు.
sunny deol
dharmendra
bjp
bollywood

More Telugu News