Jagan: ​జగన్, కేసీఆర్ లకు మోదీ గెలవరని అర్థమైపోయింది, అందుకే రాహుల్ జపం చేస్తున్నారు: రాజేంద్రప్రసాద్

  • లోటస్ పాండ్ ఏసీ రూముల్లో కూర్చున్న జగన్ ఏపీని మర్చిపోయారు
  • రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతుందని జగన్ కు అర్థమైంది
  • ప్రజల్లోకి రావడమే మానేశారు
టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తాజాగా కేసీఆర్, జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్నమొన్నటి వరకు మోదీతో అంటకాగిన కేసీఆర్, జగన్ లకు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు బోధపడ్డాయని, మోదీ గెలవరని అర్థమవ్వడంతో రాహుల్ గాంధీ జపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటు రాష్ట్రంలో కూడా వైసీపీ ఓడిపోతుందని తెలియడంతో జగన్ లోటస్ పాండ్ ఏసీ రూములకే పరిమితమైపోయారని, ఏపీని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ ప్రజల్లోకి రావడమే మానేశారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికల్లో మోదీ, కేసీఆర్, జగన్ ఏకమై వచ్చినా చంద్రబాబు సింగిల్ హ్యాండ్ తో తుత్తునియలు చేశారని అన్నారు.
Jagan
KCR
Chandrababu
Narendra Modi
Rahul Gandhi

More Telugu News